Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
నాయకత్వం అంటే ఏమిటి?
నాయకత్వం అనేది మీ బిజినెస్ కార్డు మీద ఉన్న మీ సూదాతో గాని మీ ఆఫీసు రూపురేఖలతో కాని ముడిపడిలేదు. నాయకత్వం అంటే మీరు ఎంత ధనం సంపాదించారని కాని ఎంత ఖరీదైన దుస్తులు వేసుకున్నారని కాని కాదు ముఖ్యం. నాయకత్వం ఒక సిద్ధాంతం. అది ఒక దృక్పథం.అది ఒక మానసిక పరిస్థితి. అది మనలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది.
ఈ ఉదాహరణ చూడండి. నేను ఎక్కువగా ప్రయాణాలు చేయటం వల్ల నా పెట్టెలు పాడయిపోతుంటాయి. కొన్ని నెలల కిందట నేను రష్యా వెళ్లివచ్చాక (మీరు మరణించేలోపు చూసి తీరాల్సిన ప్రదేశాలలో సెయింట్ | ఎటర్స్ బర్గ్ ని వేసుకోవాలి మీరు) నా పెట్టె హ్యాండిల్ ఊడిపోయింది. టొరొంటోలో ఒక డిలర్ అయిన ఈవెక్స్ దగ్గరకి తీసుకువెళ్ళాను దాన్ని. కౌంటర్ లో ఉన్న వ్యక్తి నన్ను సాదరపూర్వకంగా పలకరించి, కొన్ని రోజుల్లో, హ్యాండిల్ బాగుచేసే పెట్టాడు .