Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹60

                      బాల సాహిత్యంలో విశేషకృషి చేసిన సదానంద చిత్తూరు జిల్లా పాకాలలో 22 ఫిబ్రవరి 1939న జన్మించారు. S.S.L.C (సాధారణ విద్య), T.S.L.C (సాంకేతిక విద్య) చదివారు. ప్రైమరీ స్కూలు టీచర్‌గా 36 సంవత్సరాలు పనిచేసి 1997లో పదవీ విరమణ చేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడుగా జాతీయ బహుమతి పొందారు. రాష్ట్రప్రభుత్వానికి తెలుగు వాచకాలు రాశారు. ప్రసిద్ధ పత్రికలలో కథానికలు, నవలలు, వ్యాసాలు, కవితలు, పిల్లల కథలు, బాలగేయాలు, కార్టూనులు, కార్టూన్ కథలు, పిల్లల నవలలు రచించారు.

                      'బంగారు నడిచిన బాట' నవలకు కేంద్రప్రభుత్వ విద్యాశాఖవారి ఉత్తమ బాల సాహిత్య బహుమతి (1966); 'నవ్వే పెదవులు-ఏడ్చేకళ్లు' కథల సంపుటికి ఆంధ్రసాహిత్య అకాడమీ అవార్డు (1976) లభించింది. పరాగభూమి (2017) కథల సంపుటి ప్రచురించారు. పిల్లల కథలు - శివానందలహరి (1983), విందుభోజనం (1967), చల్లని తల్లి, నీతికథామంజరి (1966), సాంబయ్య గుర్రం(1964), తుస్సన్న మహిమలు (2016), నవలలు-గందరగోళం (1976), గాడిద బ్రతుకులు (1972), కథలు- పైరుగాలి, రక్తయజ్ఞం, రంగురంగుల చీకటి, వ్యంగ్యకథలు - ఓండ్రింతలు మొ|| రచనలు వెలువరించారు.

                       1992లో నేషనల్ అవార్డు, 1996లో సృజనాత్మక సాహిత్యా నికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 1997లో 'వెల్లువలో మనం' కవితా సంపుటికి కుప్పం రెడ్డెమ్మ సాహితీ సత్కారం, 1998లో డా|| నన్నపనేని మంగాదేవి బాలసాహిత్య పురస్కారం, 2001లో పులికంటి సాహితీ సత్కారం, 2003లో అధికార

భాషా సంఘం వారి భాషా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తెలుగు వెలుగు' B

                       పురస్కారం (2016) మొ|| అనేక పురస్కారాలను పొందారు.