Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹275

నా మాట

"హిట్ లిస్ట్ "నవల స్వాతి వారపత్రికలో సీరియల్ గా వచ్చినప్పుడు పాఠకుల స్పందన నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎందరో ఉత్తరాలు రాసారు. కొంతమంది అయితే నన్ను చూడడానికి మా ఇంటికొచ్చారు. వారిలో AV సోమయాజులు ఒకరు. ఇప్పటికీ నా రచన ఏది ఏపత్రికలో వచ్చినా ఉత్తరం రాయడం లేదా ఫోన్లో పలకరించడం చేస్తారు. ఈ మధ్య స్వాతి మాసపత్రికలో నా నవల వచ్చినప్పుడు కూడా ఉత్తరం రాసారు. ఆయనకి ఎనభై దాటి ఉంటుంది వయసు. పాఠకుడు అభిమానిస్తే రచయితకి ఎంతటి గౌరవం ఇస్తాడో చెప్పే సంఘటన ఇది.

నా రచన పాఠకులకు నచ్చడం కోసం విపరీతంగా కష్టపడతాను. నా నవల పేజీ తెరిచాక చివరి పేజీ వరకూ కింద పెట్టకూడదని అనుకుంటాను. విరివిగా రాయాలని, నా పుస్తకాలు కుప్పలుగా మార్కెట్లో ఉండాలని అనుకోను. తక్కువ రాసినా ఎక్కువమంది పాఠకుల్ని ఆకట్టుకోవాలని కోరుకుంటాను. నా రచన ద్వారా జీవితంలోని కొత్త అంశాన్ని చిత్రించడం కోసం తాపత్రయ పడతాను. వ్యాపార ధోరణి, వాస్తవికత రెండూ వేరువేరని చెప్పేవారికి నా రచనలు కొంతవరకూ జవాబు చెబుతాయి. నేను ఏదో ఉద్దరించాలని రచన స్వీకరించలేదు. నాలోని అసంతృప్తిని అదిగమించడానికి అక్షరాన్ని ఆసరా చేసుకున్నాను

సాధారణంగా ఒక నవల రాయడానికి నేను ఎక్కువ సమయం తీసుకుంటాను దీనికి మొదటి కారణం వృత్తిలోని వత్తిడి అయినా ఆ వత్తిడి అదిగమించడానికి | నాకు ఎంతో సహకరించింది. క్రైమ్, సస్పెన్స్ నవల రాయడమంటే అంత తేలిక..................