Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఉప్పు సత్యాగ్రహంలో కనకమ్మ బృందం ఎక్కడ స్త్రీ విద్య ఉద్దరించబడిందో,ఎక్కడ మహిళల ప్రాథమిక హక్కులు రక్షించబడినవో, ఎక్కడ రైతు ఉద్యమాలు పుష్పించి, ఫలించినవో అక్కడ కనకమ్మ పేరు వినబడుతుంది, ఆమె మూర్తి కనబడుతుంది !
- పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య
డాక్టర్ కాళిదాసు పురుషోత్తం ఉస్మానియాలో ఆచార్య బిరుదురాజు రామరాజు గారి పర్యవేక్షణలో పిహెచ్ డిచేశారు(1971). నెల్లూరు సర్వోదయ కాలేజిలో తెలుగు హెడ్ గా, ప్రిన్సిపాల్ గాచేసి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. పిహెచ్ డి పరిశోధన “వెంకటగిరి చరిత్ర సాహిత్యం ” 2014లో ప్రచురించారు. పెన్నేపల్లి గోపాలకృష్ణ, డాక్టర్ మన్నం రాయుడు, కాళిదాసు పురుషోత్తం సంపాదకులుగా గురజాడ లబ్ద సమగ్ర రచనల సంకలనం 'గురుజాడలు'ను మనసు ఫౌండేషన్ 2012లో వెలువరించింది. మనసు ఫౌండేషన్ 2019 ఫిబ్రవరిలో పఠాభి శతజయంతిని పురస్కరించుకుని పఠాభి సమగ్ర రచనల సంకలనాన్ని వెలువరించింది. దీనికి పురుషోత్తం సహ సంపాదకులు. జూలియా థామస్ ఇంగ్లీషు లేఖలను 'ఆమెలేఖలు' పేరుతో అనువదించారు.