Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
శ్రీ భువనేశ్వరీ ఆవరణార్చన కల్పము శ్రీగురు మంగళాశీర్వచనములు భువనములకు అధిపతి భువనేశ్వరి హకారము, రేఫ, మాయ (ఈంకారము)లతో కూడి ఉన్నదే శక్తి ప్రణవము అదే 'ప్రీం' ఇదియే భువనేశ్వరి సూక్ష్మ రూపము హ ఒక ధ్వని దీని నుండియే సమస్త జగత్తు ఉత్పన్నమవుతున్నది అందువలననే ఈమె భువనములకు అధిపతి అయినది ఈ తల్లి ఆరాధన వలన జ్ఞానము, మోక్షము కలుగుతాయి శ్రీవిద్యోపాసకులకు ఈమెను ఆరాధించడం ఎంతో ముఖ్యము ఇంతటి ఉ త్కృష్టమైన ఈమె ఆరాధన అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి “శ్రీభువనేశ్వరీ ఆవరణార్చన కల్పము” అను ఈ పుస్తకమును నా శిష్యుడు భువనానందనాథుడు అయలసోమయాజుల ఉమామహేశ్వర రవి పూర్తిగా దక్షిణాచార సంప్రదాయంలో సంకలనం చేసి భక్తజనులకు, సాధకులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు అతని ఈ ప్రయత్నాన్ని మంత్రవేత్తలు, సాధకులు అభినందింతురుగాక ఇంతటి చక్కని పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన చిరంజీవి అయలసోమయాజుల ఉమామహేశ్వర రవికి, అతని కుటుంబసభ్యులకు నా ఆశీర్వచనములు ఆ పరదేవత అనుగ్రహసుధ వారిమీద ఎల్లప్పుడు ఎడతెగని ధారగా కురవాలని శ్రీమాతను ప్రార్ధిస్తున్నాను సర్వేజనాస్సుఖినోభవంతు
శ్రీప్రకాశానందనాథ
శ్రీపాద జగన్నాథస్వామి
(హైదరాబాద్) 06112021