ఏ మాసములోనైనా శుక్ల సప్తమిరోజు ఆదివారము అయినచో ఆ సప్తమిని భానుసప్తమి, విజయ సప్తమి, కల్యాణ సప్తమి అందురు. ఈ కల్యాణ సప్తమి రోజు ఆచరించే సూర్యారాధన విశేష ఫలప్రదము. సమస్త కోరికలు సిద్ధిస్తాయి.
1 సప్తమినాడు నల్లని వస్త్రములు ధరించరాదు. తెల్లని వస్త్రములు ధరించవలెను.
2 నువ్వులనూనె ఉపయోగించరాదు. తాకరాదు. ఆవునెయ్యితో దీపారాధన చేయాలి.
3 మధ్య మాంసములు ధూమపానము నిషేధము. జూదము, స్త్రీ సాంగత్యము పనికిరాదు.
4 ఇతరులకు ద్రోహము తలపెట్టరాదు. నిందించరాదు. మౌనము వహించుట మేలు.
5 శవమును చూడరాదు. శారీరక మానసిక శుద్ధి కలిగి యుండాలి. మడి పాటించాలి.
6 సూర్య భగవానుని ధ్యానిస్తూ గడపవలెను.
-శ్రీ శ్రీపాద వెంకట సుబ్రహ్మణ్యం.