Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
జననము : 1926, గుంటూరు జిల్లా, బాపట్లలో సంప్రదాయ వైష్ణవ కుటుంబమున వీరు జన్మించిరి. తండ్రి గారి నుండి వేదము, పురాణములు, ధర్మశాస్త్రము, యోగము, జ్యోతిష్యము, ఆయుర్వేదము అభ్యసించిరి. ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి తెలుగు భాషయందు M.A., Ph.D., డిగ్రీలను పొంది 1974 వరకు అధ్యాపకులుగా పనిచేసిరి. తెలుగు, సంస్కృతము, ఆంగ్లములలో గద్య, పద్య, నాటక నవలా రచనలు చేసిరి. ప్రాక్పశ్చిమ సమన్వయమునకై పలుమార్లు పాశ్చాత్య ఖండములలో పర్యటించి మన దేశము నందును, పాశ్చాత్య ఖండము లందును వేలాదిమంది శిష్యులకు ఆచార్యత్వము వహించిరి. అనేక గ్రంథముల మరియు ప్రసంగముల ద్వారా ఆధ్యాత్మిక విద్యను ప్రపంచమునకు అందించిరి.