Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
హేమాడ్పంత్ కవిత్వం కీశ్రీ గోవిందరావు రఘునాధ దాభోల్కర్ ఉరఫ్ హేమాడ పంత్ రచించి 'శ్రీసాయిసచ్చరిత ముక్క బ్యాత్మిక విశిష్టత నిర్వివాదాంశం. అందులో మహాత్ముల్లోకెల్లా తలమానికమనదగిన శ్రీసాయిబాబా జవతరం వుంది. అమృతతుల్యమైన ఆయన ఉపదేశముంది. ఆయన చేసిన చమత్కారాల గురించీ, భక్తుల అనుభవాల గురించి అనేక కథలున్నాయి. గీత, వేదాంతాల్లోని సారం అయితే అడుగడుగునా తొణికిసలాడుతూ వుంది. ముఖ్యంగా ఈ గ్రంధం శ్రీసాయిబాబా ఆజ్ఞనీ, ఆశీస్సులనీ తీసుకొని వ్రాయబడటంతో ముముక్షువుల అకసాధనకి మార్గదర్శకమై వుంది. కి.శే. బాలకృష్ణ వి.దేవ్ (బాబా బాలుడు) తన అవతరణ అధ్యాయంలో అంటాడు -
ఇది గ్రంధం కాదు. కల్పవృక్షమే. సాధారణ సంసారులకు రసహీనంగా అనిపిస్తుంది. మోక్షాన్ని కోరుకొనే భావికులకు అది కేవలం మోక్షమే అనిపిస్తుంది. ఇది ప్రత్యక్షంగా అనుభవించి చూడాలి.
(11)
దుప్పటికీ అది
మళ్లీ చదవవలకింపు
అయితే విషయం ఎంత ఉత్తమంగా వున్నప్పటికీ అది భక్తులముందు పెట్టినప్పుడు దానికి భాషా మాధుర్యమూ లేదా రసమధురిమా లేకపోతే పాఠకులకు అది మళ్లీ మళ్లీ చదవటానికీ, శ్రోతలకు దాన్ని మళ్లీ మళ్లీ వినటానికి ఇష్టముండదు. శ్రీసాయిసచ్చరితలోని ఓవీలు చాలామటుకు చెవులకింపుగా మనసుకి ఆకర్షణీయంగా అనిపించి, వాటిని పదే పదే చదవాలనిపిస్తుంది. ఆ ఓవీలు రచించేటప్పుడు | హేమాడ్ పంత్ తన సర్వకళాకుశలతని వినియోగించివుండాలి. మనం ఇప్పుడు దాన్ని వివేచన చేస్తున్నాం. అందుకే శ్రీసాయిసచ్చరితలోని కావ్యరసాన్ని ఆస్వాదిస్తున్నాం.
ఛందస్సు ఎంపిక మహారాష్ట్రలోని ఎందరో మహాత్ములు మరాఠీభాషలో ఆధ్యాత్మిక గ్రంధాలను రచిస్తున్నప్పుడు 'ఓవి ఛందస్సునే ఉపయోగించుకొన్నారు. ఉదాహరణకి జ్ఞానేశ్వరి, ఏకనాధ భాగవతం, దాసబోధ మొదలైనవి. ఈ ఛందస్సులో నాలుగు చరణాలుంటాయి. మొదటి మూడు చరణాల్లో యమకం వుంటుంది. (చరణం చివర అదే అక్షరాన్ని మళ్లీ మళ్లీ వాడటం) కానీ అక్షరాల సంఖ్యకి నిర్బంధనం వుండదు. 5 నుంచి 15 అక్షరాలు కూడా వుండొచ్చు. 4వ చరణానికి యమకం వుండదు. కానీ అందులోని అక్షరాలు మొదటి మూడు చరణాల్లోని అక్షరాలకన్నా అధికంగా వుండవు. ఉదా:
అతా విశ్వాత్మకే దేవే | యేడే వాగ్యథేతోషావే | తోషానీ మజ్ ద్యావే | ఏసాయదావహే || (జ్ఞానేశ్వరి అ.18, 4 186) తియాపరీశ్రోతా | అనుభవావీ హేకథా || అతిహకువార పడేచిత్తా | అజూనియా II (జ్ఞా. అ.1, 4,57)...................